యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

పాపన్నపేట(మెదక్‌): మండల కేంద్రంలో సోమ వారం యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఓ ఫర్టిలైజర్‌ దుకాణానికి 450 బస్తాల యూరియా రాగా రైతులు తరలివచ్చారు. సోమవారం సాయంత్రం 3 గంటల వరకు డీడీ నంబర్‌ రాకపోవడంతో స్టాక్‌ ఆన్‌లైన్‌ నమోదు చేయలేకపోయారు. గంటలు గడుస్తున్నా, డీడీ నంబర్‌ రాకపోవడం, యూ రియా పంపిణీ ప్రారంభం కాకపోవడంతో ఆగ్ర హం చెందిన రైతులు మెదక్‌–బొడ్మట్‌పల్లి రోడ్డు మీదికి వచ్చి ఆందోళనకు దిగారు. సుమారు గంటపాటు సాగిన రాస్తారోకోతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సతీశ్‌, ఏఈఓ జనార్దన్‌ రైతులను సముదాయించారు. మంగళవారం ఉదయం యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో రైతులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement