మెదక్‌జోన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగియడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డిగ్రీ కళాశాలలో చేరాలంటూ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ మాట్లాడుతూ.. 2026– 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా లభించిందని తెలిపారు. జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులను కలిసి డిగ్రీ దోస్త్ అడ్మిషన్ల గురించి వివరించారు. అనంతరం దోస్త్ అడ్మిషన్ల సమన్వయకర్త సురేందర్‌రావు అడ్మిషన్ల పెంపునకు అధ్యాపకులు చేస్తున్న కృషిని అభినందించారు. కాగా కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, రామాయంపేట, గోపాలేపేట, చేగుంట, మెదక్‌లోని అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.


