రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట డిప్యూటీ రేంజ్‌ అధికారిణి గీతా అగర్వాల్‌ ఆశాఖలో రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళా ఉద్యోగిగా ఎంపికయ్యారు. ఈమేరకు శనివారం దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జవేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) సువర్ణ, అదనపు డీజీ స్వాతి లక్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గతేడాది జిల్లాస్థాయి ఉత్తమ అధికారిణిగా గీత అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా ఆశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

10న ఆర్టిజన్ల మహాధర్నా

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యుత్‌ శాఖలోని ఆర్టిజన్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న హైదరాబాద్‌ టీజీఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపడుతున్నట్లు టీవీఏఈజేఏసీ చైర్మన్‌ బీఎన్‌ స్వామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌శాఖలో 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్నా, ఇప్పటికీ రెగ్యులర్‌ కార్మికులుగా గుర్తింపు పొ ందలేకపోవడం దారుణం అన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆర్టిజన్లు సమస్యల పరిష్కారానికి చేపడుతున్న ఈ సమ్మెకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కార్మికులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

సర్కార్‌ బడి విద్యార్థుల సత్తా

పాపన్నపేట(మెదక్‌): మండల పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మనోహర్‌, విష్ణువర్ధన్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికై నట్లు గైడ్‌ టీచర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. ఈసందర్భంగా హెచ్‌ఎం భూజాత, టీచర్లు దత్తురెడ్డి, శివకుమార్‌, నాగభూషణం, ప్రసాద్‌, తులసీరాం, సోమశేఖర్‌ విద్యార్థులను అభినందించారు.

జాతీయస్థాయి

రగ్బీ పోటీలో ప్రతిభ

నర్సాపూర్‌ రూరల్‌: జాతీయస్థాయి రగ్బీ పోటీలో మండలంలోని నారాయణపూర్‌ గిరిజన గురుకుల బాలికల కళాశాల, పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచినట్లు ప్రిన్సిపాల్‌ లలితాదేవి శనివారం తెలిపారు. కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న ఎన్‌. వందన ఇవాళ బీహార్‌లో జరిగిన జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ రగ్బీ పోటీలో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని ప్రతిభ కనబరచినట్లు చెప్పారు. అలాగే 9వ తరగతి విద్యార్థిని నందిని ఇటీవల చైన్నెలో జరిగిన జాతీయస్థాయి అస్మిత్‌ ఖేల్‌ ఇండియా రగ్బీ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడి కాంస్య పతకం సాధించింది. ఈసందర్భంగా విద్యార్థులను అధ్యాపకులు తోటి విద్యార్థులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement