ముంచుకొస్తున్న గడువు
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ నాలుగు మున్నిపాలిటీల్లో ఈ ఏడాది రూ.15.72 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోయాయి. కాగా ఇప్పటివరకు రూ. 7.92 కోట్లు మాత్రమే అధికారులు వసూలు చేశారు. ఇంకా రూ. 7.8 కోట్ల బకాయిలు ఉన్నాయి. ట్యాక్స్ వసూలుకు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. కాగా కమర్శియల్ షాపులతో పాటు, పెద్ద పెద్ద కాంప్లెక్స్ లు, ఫంక్షన్‌హాళ్లు, గోదాంలు, పరిశ్రమలు, రైస్‌మిల్లులు, సినిమాహాల్స్, షోరూంలతో పాటు ఖాళీ స్థలాలకు (ప్లాట్లు) సంబంధించని అధికంగా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటి పన్నులు మాత్రమే ఎక్కువ శాతం వసూలు అయినట్లు తెలిసింది.
ఏటా మార్చి వరకు అన్నిరకాల ట్యాక్స్‌లు చెల్లించా ల్సి ఉంటుంది. వాటిని సకాలంలో చెల్లించకుంటే జూన్‌వరకు అవకాశం ఇస్తారు. జూలై నుంచి అసలుపై ఎంత డ్యూ ఉందో దానికి నెలకు రూ. 2 శాతం వడ్డీ వేస్తారు. ఆ మొత్తం చెల్లించే వరకు ప్రతినెల రెండు శాతం వడ్డీ పడుతూనే ఉంటుంది. గతంలో ఇలా పేరుకపోయిన మొండి బకాయిలకు వడ్డీపై 90 శాతం సబ్సిడీని ఇచ్చి వసూలు చేసిన ఘటనలున్నాయి.
జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ మెదక్ ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటు అయింది. 14 వేల పైచిలుకు ఇళ్లు ఉండగా, 70 వేల పైచిలుకు జనాభా ఉన్నారు. పట్టణం చుట్టూ వెంచర్లు (ఖాళీ ప్లాట్లు) ఉన్నాయి. ఈ బల్దియాలో ఏడాది రూ.7.35 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.3.42 కోట్లు మాత్రమే వసూలు అయింది. ఈ లెక్కన ఇంకా 3.93 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. అలాగే నర్సాపూర్‌లో రూ. 3.50 కోట్లకు గానూ రూ.2.25 కోట్లు, రామాయంపేటలో రూ.1.76 కోట్లకు ఇప్పటివరకు రూ.86 లక్షలు, తూప్రాన్‌లో రూ.3.11 కోట్ల కు రూ.1.93 కోట్లు మాత్రమే వసూలు చేశారు.
న్యూస్‌రీల్
మార్చి 31 వరకు చాన్స్ జిల్లాలోని నాలుగు బల్దియాల్లో రూ.15.72 కోట్ల బకాయిలు వసూలు చేసింది రూ. 7.92 కోట్లు మాత్రమే..
మున్సిపల్ ఎన్నికల కారణంగా పన్ను వసూళ్లలో ఆలస్యం అయింది. ఈ నెలరోజులు ప్రత్యేక దృష్టి సారించి టార్గెట్‌ను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రెడ్డి,
మెదక్ మున్సిపల్ కమిషనర్
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆస్తి పన్ను వసూళ ్లలో కనిపించని పురోగతి
జూన్ దాటితే వడ్డీతో వసూలు
మెదక్ బల్దియాలోనే అత్యధికం
మున్సిపాలిటీల్లో ఆశించిన మేర ఆస్తి పన్ను వసూలు కావడం లేదు. గడిచిన 11 నెలల్లో కనీసం సగం కూడా వసూలు చేయలేదు. మొన్నటివరకు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో వసూళ్లకు సన్నద్ధం అవుతున్నారు. – మెదక్‌జోన్
ఎన్నికలతో ఆలస్యం
ఆర్టీసీ ఆస్తి పన్ను చెల్లింపు
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీకి సంబంధించిన ఆస్తి పన్నును డీఎం సురేఖ బుధవారం మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో, డీఎం కార్యాలయం, పాత, కొత్త బస్టాండ్‌లతో పాటు ఆర్టీసీ క్వార్టర్లకు సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం రూ. 2,71,801 చెక్కును అందజేశారు.
1/1
ముంచుకొస్తున్న గడువు