రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఆర్.వెంకటాపూర్‌లో పంచాయతీ, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు, లక్ష్మాపూర్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పిట్టలవాడకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమ, మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతల స్వామి, నాయకులు రమేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, పోచమ్మల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్


