9నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు
రైతులకు, మహిళా
అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో తొమ్మిది నెలల్లో రూ.4,611 కోట్ల రుణాలు లబ్ధిదారులకు అందజేశామని, అందులో రైతులు, మహిళా సంఘాలకు పెద్దపీట వేశామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆర్థికాభివృద్ధి రేటులో జిల్లా దూసుకుపోతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణ లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందన్నారు. యువతకు ఉపాధి కల్పించే పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ వంటి పథకాలపై బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రుణాలు ఇవ్వడమే కాకుండా సకాలంలో వసూలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో ఆర్‌బీఐ ప్రతినిధి లక్ష్మిశ్రావ్య, ఎల్‌డీఎం బాపూజీ, నాబార్డ్ డీడీఎం కృష్ణ చైతన్య, వివిధ బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంఘాలకు పెద్దపీట


