శ్రీలంక బృందం సందర్శన
తూప్రాన్: మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ఎన్‌ఐఆర్‌డీ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ ఆంజనేయులుగౌడ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డ్‌లను పరిశీలించారు. అంగాన్‌వాడీల పనితీరు, జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందుతున్న ప్రయోజనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ అంచలంచెలుగా అభివృద్ధి చెంది మోడల్ విలేజ్‌గా మారిన తీరుతెన్నులపై శ్రీలంక ప్రజా ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని బృందం సందర్శించి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎన్‌ఐఆర్‌డీ ప్రతినిధి ఆశాలత, ఎంపీడీవో సతీష్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, సత్యం, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


