‘దవా’లేని ఖానా!
మెదక్‌జోన్: మెదక్ పెద్దాస్పత్రిలో మందులు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి మెదక్‌తో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి, గోపాల్‌పేట తదితర మండలాలకు చెందిన వారు సైతం వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. నిత్యం ఓపీ వెయ్యికి పైగా ఉంటుంది. కొన్ని రోజులుగా పలురకాల మందులను బయటకు రాస్తున్నారు. సర్కార్ దవాఖానకు వచ్చేది నిరుపేదలు మాత్రమే. అలాంటిది వారు డబ్బులు వెచ్చించి బయట మందులను కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వైద్య విద్యార్థులకు బోధించే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్టులు, జిల్లా ఆస్పత్రితో పాటు ఎంసీహెచ్‌లలో రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. సీటీస్కాన్‌తో పాటు అనేక రకాల ఎక్స్‌రే పరికరాలు అందుబాటులోకి రావటం, డయోగ్నోస్టిక్ సెంటర్లో వ్యాధినిర్దారణ పరీక్షలు జరుగుతుండటంతో నిత్యం వేలాది మంది పేదలు ఏ జబ్బుచేసినా పెద్దాసు పత్రికి వస్తున్నారు. అంత బాగానే ఉన్నా.. మందుల కొరత కనీసం 30 శాతం వరకు ఉండడంతో చేసేదిలేక రోగులు బయట మెడికల్ షాపుల్లో డబ్బులు వెచ్చించి కొనుగోళ్లు చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఆ స్పత్రి సూపరింటెండెంట్ సునీతను వివరణ కోరగా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పడం గమనార్హం.
మందుల కొరతతో రోగుల ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు


