విజబుల్‌ పోలీసింగ్‌తో నేరాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

విజబుల్‌ పోలీసింగ్‌తో నేరాలకు చెక్‌

Feb 28 2026 8:41 AM | Updated on Feb 28 2026 8:41 AM

విజబుల్‌ పోలీసింగ్‌తో నేరాలకు చెక్‌

విజబుల్‌ పోలీసింగ్‌తో నేరాలకు చెక్‌

మెదక్‌కలెక్టరేట్‌: ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు జరగాలని, బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. అత్యాచార, పోక్సో కేసుల్లో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి దోషులను కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు. లాంగ్‌ పెండింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు.

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement