పరిశుభ్రతే లక్ష్యంగా ‘ప్రణాళిక’ | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతే లక్ష్యంగా ‘ప్రణాళిక’

Mar 11 2026 8:37 AM | Updated on Mar 11 2026 8:37 AM

జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్‌

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): గ్రామాల్లో పరిశుభ్రతే లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కొనసాగుతోందని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్‌ అన్నారు. మంగళవారం 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల పరిధిలోని ఫైజాబాద్‌ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పాలకవర్గంతో చర్చించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, పాలకులతో పాటు, ప్రజలు సైతం గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాలలో సమస్యలు ఎదురైతే, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు తమ వంతు కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రశాంత్‌, అర్‌డబ్య్లూస్‌ ఏఈ ఆన్వేష్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సర్పంచ్‌ రాములు, ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement