సొంత స్థలం ఉన్న వారు ఇంటిని నిర్మించుకునేలా గత బీఆర్‌ఎస
న్యూస్‌రీల్
గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా ఆగిన ఇళ్లు జిల్లాలో 2,199 నిర్మాణాల గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మెదక్ పట్టణంలోని పిల్లికొటాల్‌లో పునాదిస్థాయిలోనే నిలిచిన ఇల్లు
జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూంలు నిర్మించి కొన్నింటిని పంపిణీ చేయగా, మరో 999 ఇళ్లు అర్ధంతరంగా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పిల్లర్లస్థాయిలో ఉండగా, మరికొన్ని స్లాబులు వేసి గోడలు నిర్మించకుండా వదిలేశారు. అలాగే ‘గృహజ్యోతి’ పథకం పేరిట సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకుంటే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 10 వేల పైచిలుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, వారిలో సుమారు 1,200 మంది ఇళ్లను ప్రారంభించి బేస్‌మెంట్ వరకు నిర్మించుకున్నారు. గృహజ్యోతి, డబుల్‌బెడ్రూంలకు సంబంధించి మొత్తం 2,199 ఇళ్ల నిర్మాణాలు సగంలో ఆగిపోయాయి.
నిబంధనల ప్రకారం ఉంటేనే బిల్లులు
గృహజ్యోతి పథకంలో బేస్‌మెంట్ వరకు నిర్మించుకున్న ఇళ్లను ఇప్పటికే హౌసింగ్ అధికారులు గుర్తించారు. జిల్లాలో సుమారు 1,200 ఉన్నట్లు లెక్క తేల్చారు. బేస్‌మెంట్ ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తామని అధికారులు చెబుతున్నారు. బేస్‌మెంట్ పూర్తయిన వాటికి బిల్లు కాకుండా, గోడలు, లెంటల్, స్లాబు, ఫైనల్ బిల్లు ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుండగా, బేస్‌మెంట్ వరకు నిర్మించిన గృహజ్యోతి ఇంటికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నారు. వాటిని సైతం నిబంధనల ప్రకారం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. ఒకవేళ తక్కువ ఉన్నా, ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నా వాటిని నిబంధనల వరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే జిల్లాలో 999 డబుల్ బెడ్రూంల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. వీటిని ముందుగా లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత వాటికి సైతం ప్రత్యేకంగా బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇంటి నిర్మాణాలపై అనాసక్తి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాకు 9,241 ఇళ్లు మంజూరు చేసింది. కాగా వాటిలో ఇప్పటివరకు 5,190 ఇళ్లు ప్రారంభం కాగా, మిగితావి వివిధ దశలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈలెక్కన ఇంకా 4 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇందులో ఇళ్లు ప్రారంభించని లబ్ధిదారుల పేర్లు లిస్టు నుంచి తొలగించారు. మొదటి విడతలో మిగిలిన ఇళ్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సొంత స్థలం ఉన్న వారు ఇంటిని నిర్మించుకునేలా గత బీఆర్‌ఎస


