మెదక్ కలెక్టరేట్: దేశ భవిష్యత్‌ను నిర్మించే శక్తి యువతలోనే ఉందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా ‘ 50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ– లెసెన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ’ అంశంపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమని, ఆ కాలం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు అనేక పాఠాలు నేర్పిందన్నారు. యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హుస్సేన్, అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


