నేటి నుంచి ఖేడ్‌లో ఉత్పత్తుల జాతర
నారాయణఖేడ్: రిపబ్లిక్ డేను పురస్కరించుకొని డివిజన్‌లోని స్వయం సహాయక బృందాలు రైతు బజార్‌లో ఈ నెల 25, 26 తేదీల్లో మహిళా జీవనోపాధి ఉత్పత్తుల జాతరను నిర్వహించనున్నట్లు ఐకేపీ డీపీఎంలు మల్లేశం, రమేష్‌బాబు, ఏపీఎం సాయిలు తెలిపారు. ఇందులో మహిళా సంఘాలు స్వయంగా తయారు చేసిన వివిధ ఉత్పత్తులు, దుస్తులు, తినుబండారాలు, ఇతర పదార్థాలకు సంబంధించిన 43 దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శన వల్ల మహిళా సంఘాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతిలు హాజరై జాతరను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మహిళా ఉత్పత్తులను ప్రొత్సహించడంతో పాటు సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, డీఎంటీ నారా నర్సప్ప, సీసీలు వెంకట్, సంతోష్‌కుమా ర్, సురేశ్, సుందర్‌లాల్, తుకారాం పాల్గొన్నారు.


