మోగిన నగారా
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు
మెదక్ 32 36,955
నర్సాపూర్ 15 16,876
తూప్రాన్ 16 20,259
రామాయంపేట 12 13,095
మెదక్‌జోన్: ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో నేటి నుంచి మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న స్క్రూట్నీ, ఫిబ్రవరి 3న విత్‌డ్రాలు, 11న ఎన్నికల నిర్వహణ, 13న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా అభ్యర్థులు ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు.. 7 రోజుల్లో ప్రచారం ముగించుకోవాలి. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 75 వార్డులు ఉండగా 87 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. కాగా ప్రతి వార్డులో రెండు చొప్పున 150 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఆర్వోలు) 25 మంది, ప్రిసైడింగ్ అధికారులు 125 మందిని కేటాయించి ఇప్పటికే శిక్షణనిచ్చారు.
మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ!
నామినేషన్ల స్వీకరణను ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు. కాగా మూడు వార్డులకు ఒక్క ఆర్వో చొప్పున మెదక్‌లో 32 వార్డులు ఉండగా మున్సిపల్ కార్యాలయంలోనే 11 మంది ఆర్వోలను నియమించారు. వీరు నామినేషన్లు స్వీకరించనున్నా రు. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 5 కౌంటర్లు, రామాయంపేటలో 12 వార్డులకు 4 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. కాగా రామాయంపేట, నర్సాపూర్ ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపాలి టీలు చిన్నగా ఉండటంతో వాటికి మండల పరిషత్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఒక్కో ఆర్వో మూడు వార్డుల నామినేషన్ల స్వీకరణ
నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులు
87 వేల పైచిలుకు ఓటర్లు


