విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
మనోహరాబాద్(తూప్రాన్): గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తూప్రాన్ డీఈ గరుత్మంతరాజు పేర్కొన్నారు. మంగళవారం ప్రజాబాటలో భాగంగా మండల పరిధి పోతారంలో విద్యుత్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులతో చర్చించి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. రైతుల కోసం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే, పలు వీధుల్లో ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, ఏఈ రాజ్‌కుమార్, ఇంజనీర్ ఆనంద్, నాయకులు పుట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీఈ గరుత్మంతరాజు


