రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
అదనపు కలెక్టర్‌కు
అంగన్‌వాడీ టీచర్, ఆయాల వినతి
మెదక్ కలెక్టరేట్: అంగన్‌వాడీలో సేవలందించి రిటైర్ అయిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను తక్షణమే అందజేయాలని పలువురు రిటైర్డ్ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ నగేశ్‌కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ...అంగన్‌వాడీ ఉద్యోగులు, యూనియన్లు అనేక పోరాటాల ఫలితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీఓ విడుదలైందన్నారు. దాని ప్రకారం టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిందని కానీ రిటైరైన ఒక్క టీచర్‌కుగాని, ఆయాకుగాని ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్స్ అందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిటైర్డైన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల పరిధి తిప్పన్నగుల్ల గ్రామంలో మంగళవారం మద్యపాన నిషేధం చేస్తున్నట్లు గ్రామ పాలకవర్గం తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ మంజుల ఆధ్వర్యంలో తీర్మాన పత్రాన్ని ఎస్‌ఐ రాజేష్‌కు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. జరిమానాను కట్టని యేడల పంచాయతీ తరఫున వారి దుకాణాలకు తాళం వేస్తామని హెచ్చరించారు. గ్రామాన్ని మద్యపాన నిషేధం దిశగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మంగిలిపల్లి రమేశ్, రాజు, రాములు, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. అంతకుముందు యాసంగి పంటకు నీళ్లు విడుదల ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట మంగళవారం రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ సుధా కిరణ్, ఈఈ వేణు బాబు, డీఈలు మంగారెడ్డి, చంద్రశేఖర్, ఆంజనేయులు, ఏఈ రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
మల్లన్నసాగర్ జలాలు..
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వార్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల రైతాంగానికి యాసంగి పంట సాగుకు మంగళవారం రాత్రి నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఈ కవిత, సిద్దిపేట ఈఈ శంకర్‌లు నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట, గజ్వే ల్ డీఈఈలు శిరీష, దయాకర్ పాల్గొన్నారు.
కొమురవెల్లి(సిద్దిపేట): ఆయిల్‌పామ్ సాగుతో బోలెడు లాభాలు పొందవచ్చని, రైతులు సాగు కు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జి.సువర్ణ సూచించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మొదటి మూడేళ్లు (అంతర పంటల ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అదే విధంగా కచ్చితమైన మార్కెట్ సదుపాయం ఉండడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమ ంలో జిల్లా ఆయిల్‌ఫెడ్ అధికారి భాస్కర్‌రెడ్డి, మండల ఉద్యాన అధికారిని పాల్గొన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి


