కాంగ్రెస్‌కు ఓటెందుకెయ్యాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటెందుకెయ్యాలి

Feb 10 2026 9:46 AM | Updated on Feb 10 2026 9:46 AM

కాంగ్రెస్‌కు ఓటెందుకెయ్యాలి

కాంగ్రెస్‌కు ఓటెందుకెయ్యాలి

మెదక్‌జోన్‌/రామాయంపేట/నర్సాపూర్‌ రూరల్‌: గడిచిన రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మెదక్‌లో పైసా పనిచేయలేదని, వారికి ఓటు ఎందుకు వేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్‌ పట్టణంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. మల్కాజ్‌గిరి నుంచి దాదాలను తీసుకొచ్చి బెదిరింపులకు దిగుతున్నారని, వారికి భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజుకు 25 గంటల కరెంటు ఇస్తానన్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించకుంటే బిల్లులు రావని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్‌ కాలేజీ, రైలు, నాలుగు లేన్లరోడ్ల విస్తరణతో పాటు మెదక్‌లో అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్‌ వివరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నేతలు శేరి సుభాశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, బట్టి జగపతి, మల్లికార్జున్‌గౌడ్‌, సురేందర్‌గౌడ్‌ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రామాయంపేటలో జరిగిన ప్రచార సభలో హరీశ్‌రావు మాట్లాడారు. బూతులు మాట్లాడే సీఎంకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పోలీసులు అధికార పార్టీకి మద్దతు పలకడం మానుకోవాలని సూచించారు. అనంతరం నర్సాపూర్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఢిల్లీ బీజేపీ నాయకులను కలిసి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌నాయుడు అని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన రేవంత్‌రెడ్డి సెక్యులర్‌ కాదన్నారు. మైనార్టీలు బీఆర్‌ఎస్‌కు ఓట్లేసి గెలిపించాలని కోరారు. బీజేపీ ఓటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు. నర్సాపూర్‌ను మున్సిపాలిటీ చేసి మొదటిసారి బీఆర్‌ఎస్‌ పీఠం కై వసం చేసుకుందని, రెండోసారి కూడా బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

జిల్లాను అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్సే..

మల్కాజ్‌గిరి దాదాలకు భయపడేది లేదు

మాజీ మంత్రి హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement