దుర్గమ్మ చెంత అవినీతి దందా | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ చెంత అవినీతి దందా

Feb 10 2026 9:46 AM | Updated on Feb 10 2026 9:46 AM

దుర్గ

దుర్గమ్మ చెంత అవినీతి దందా

చైర్మన్‌ గిరి.. నేతల గురి సదాశివపేట చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌మహిళకు రిజర్వు కావడంతో ఆసక్తిపెరిగింది. వివరాలు 8లో u కాసుల వేట

న్యూస్‌రీల్‌

చైర్మన్‌ గిరి.. నేతల గురి సదాశివపేట చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌మహిళకు రిజర్వు కావడంతో ఆసక్తిపెరిగింది. వివరాలు 8లో u

మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

నిధుల వరద..

మట్టి చల్లు.. నీళ్లు పట్టు.. లక్షలు కొట్టు

పర్సంటేజీల ఆశలో అధికారులు

పాపన్నపేట(మెదక్‌): ‘పంచాయతీరాజ్‌ శాఖ ద్వా రా గత ఏడుపాయల జాతరకు సంబంధించి రూ. 22.30 లక్షల పనులు చేస్తే, చెక్‌ నంబర్‌ 649125తో రూ. 20 లక్షలు ఎమర్జింగ్‌ టెక్నో సర్వీసెస్‌’ అనే ఒక ఫర్మ్‌కు చెల్లించారు. అది కూడా ఓ స్థానిక నాయకుడికి చెక్‌ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి జాతర పనులు టెండర్లు నిర్వహించకుండా, నాయకులు సూచించిన ఫర్మ్‌ (సంస్థ)లకే అప్పజెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జాతర వచ్చిందంటే పండుగే

స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ వినియోగం దారి తప్పుతోంది. లక్షలాది భక్తుల ఆనందం కోసం సంబరంగా నిర్వహించాలనుకున్న మహా జాతర.. కాంట్రాక్టర్లకు.. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2024– 25 శివరాత్రి జాతరకు రూ. 2 కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధులు మంజూరు కాగా, ఏడుపాయల ఈఓ ద్వారా రూ. 93,04,139 ఖర్చయ్యాయి. ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా రూ.1,06,95,861 ఖర్చు చేశారు. జాతరలో సుమారు 33 శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌, జిల్లా పంచాయతీ శాఖ, ఫిషరీస్‌, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా రూ. 90.80,254 ఖర్చు చేశారు. ఇందులో కూడా సింహభాగం తాత్కాలిక పనులే. ఏజెన్సీల పేరిట స్థానిక నాయకులే పని చేసి, అధికారులకు, ఏజెన్సీలకు ఎవరి వాటాలు వారికి ముట్ట జెప్పారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా రూ. 5 లక్షలు దాటితే టెండర్‌ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకే ఏజెన్సీకి రూ. 20 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం.

2

ఫర్మ్‌ల పేరు.. నాయకుల జోరు

జరిగిన తంతు ఇలా..

పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా కేవలం జంక్షన్‌ల వద్ద సైన్‌ బోర్డులు, బుష్‌ కట్టింగ్‌, మట్టి వేసి చదును చేసేందుకు రూ. 24,14,200 చెల్లించారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. మిషన్‌ భగీర థ ద్వారా తాత్కాలిక టాయిలెట్ల నిర్వహణ, వాటికి బ్యానర్‌ డోర్స్‌, ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరా, తాగు నీటి ట్యాప్‌ల మరమ్మతులు, స్కావెంజర్ల భృతికి రూ. 22,54,660 ఖర్చు చేశారు. వీటిలో ట్యాంకర్‌ల చెల్లింపు, ఫ్లెక్సీ బ్యానర్‌ డోర్లు, షవర్‌ల ఏర్పాటులో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి.

జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా రూ.15.25 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో సేఫ్టీ గ్లౌవ్స్‌, క్యాప్స్‌, టీషర్ట్‌లు, బ్లాక్‌ కవర్స్‌, బ్లీచింగ్‌ ఫౌడర్‌, ఫ్లెక్సీ బోర్డులు కొనుగోలు చేశారు. ఇందులో బిల్లులు ఎక్కువగా చూపినట్లు విమర్శలున్నాయి. కాగా మల్టీ పర్పస్‌ వర్కర్స్‌ టీఏలకు రూ. 2,28,500, అకామిడేషన్‌ హాల్‌కు రూ.48 వేలు, రోజు వారి సపాయి కార్మికులకు రూ. 5,82 లక్షలు చెల్లించినట్లు చూపారు.

ఫిషరీస్‌ కార్యాలయం నుంచి రూ.10,53,282 ఖర్చు చేశారు. గజ ఈతగాళ్లకు, టీషర్ట్‌లు, క్యాప్‌లకు, బోట్‌ కిరాయిలు, భోజనాలకు చెల్లించారు. అయితే ఆలయం నుంచి అన్ని డిపార్ట్‌మెంట్లకు భోజన వసతి కల్పించినప్పటికీ, వీరు భోజన ఖర్చులకు గాను హోటల్‌ ద్వారా రూ. 2.50 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడం గమనార్హం.

ఆర్‌అండ్‌బీ శాఖ వారు రూ. 10.25 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. పార్కింగ్‌, చెక్‌ డ్యాం, స్నానఘాట్లు, క్యూలైన్ల వద్ద బారికేడ్ల ఏర్పాటుకు ఈ ఖర్చును చూపారు.

పోలీస్‌శాఖకు ఆలయం నుంచి ఆవాస, భోజన సౌకర్యాలు కల్పించినప్పటికీ ఖర్చుల పేరిట రూ.9,92,312 చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి చెల్లింపులు లేక పోయినప్పటికీ, రెండేళ్ల నుంచి ఎస్డీఎఫ్‌ నుంచి ఖర్చులు చెల్లిస్తున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు.

ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 10 శాతం కమీషన్‌ తీసుకొని, జాతర పనులను అడ్డగోలుగా రికార్డు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

దుర్గమ్మ చెంత అవినీతి దందా1
1/1

దుర్గమ్మ చెంత అవినీతి దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement