మెదక్ కలెక్టరేట్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహానుభావుడని కొనియాడారు. అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం చేసిన త్యా గాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


