ఇదేం చెత్త పని ? | - | Sakshi
Sakshi News home page

ఇదేం చెత్త పని ?

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

ఇదేం చెత్త పని ? నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు పీఆర్సీ నివేదికలో జాప్యం వద్దు గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

నర్సాపూర్‌: నర్సాపూర్‌– హైదరాబాద్‌ మార్గంలోని జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టుకు ఇరువైపులా చెత్తను అడ్డగోలుగా వేయడంతో కుప్పలుగా పేరుకుపోయింది. దుర్వాసన వెదజల్లుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు వాటి కోసం గుంపులుగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని గిరిజన సంక్షేమ అధికారి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్సు వ్యవధి ఆరు నెలలు ఉంటుందని తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం http:// dsapponine.com /sdr/form/register.php వెబ్‌ సైట్‌లో సంప్రదించాలన్నారు

నర్సాపూర్‌: పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం సంఘం మండల శాఖ అధ్యక్షుడు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు చంద్రశేఖర్‌, గంగాధర్‌ రావు, రమేశ్‌, అప్పలనాయుడు, సత్యనారాయణ, కళారాము లు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పిల్లుట్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంతో పాటు మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో అంతర్గత మురికికాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మురళిగౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు నవీన్‌గుప్తా, వెంకట్రామిరెడ్డి, రాఘవరెడ్డి, సతీశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement