12న సార్వత్రిక సమ్మె
చిన్నశంకరంపేట(మెదక్): కార్మికుల హక్కులకు విఘాతం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల 12న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కోరారు. సోమవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సార్వత్రిక ప్రచార యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నూతన లేబర్‌కోడ్‌లను అమల్లోకి తెచ్చిందన్నారు. దీంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ సహాయ కార్యదర్శి గౌరీ, అజయ్, దుర్గా, శౌకత్ పాల్గొన్నారు.
గజ్వేల్: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌ను, అబద్దాలు చెప్పే బీజేపీనీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నమ్మి మోసపోవద్దని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి స్వప్న, 14వవార్డు అభ్యర్థి శీరిషలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై తీరుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.
చరిత్రలో నిలిచిపోయేలా
అభివృద్ధి: మంత్రి పొన్నం
హుస్నాబాద్: పాత కాలం వారు మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు సేవలను ఎలా గుర్తు చేసుకుంటున్నారో హుస్నాబాద్‌లో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేసి తీరుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మున్సిపాలిటీల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్ల చరిత్రలో మొదటి సారి మంత్రి అయ్యే అవకాశం హుస్నాబాద్‌కు వచ్చిందన్నారు. భవిష్యత్‌లో నీటి చుక్క దుకాణాల్లోకి రాకుండా రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో పనులు ప్రారంభించామన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా హుస్నాబాద్‌ను కరీంనగర్ మున్సిపాలిటిలో కలపడం తథ్యమన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. బస్ స్టేషన్‌ను అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లేలా చేశామన్నారు.
‘ఉపాధ్యాయ
సమస్యలపై పోరాటం’
12న సార్వత్రిక సమ్మె


