చేర్యాల చైతన్యానికి అడ్డా..
● ఈ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే ● రోడ్ షోలో మంత్రి సీతక్క ● పాల్గొన్న ఎంపీ చామల
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రాంతం చైతన్యానికి అడ్డా.. పోరాటాలకు పురిటిగడ్డ అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా గాంధీ సెంటర్ నుంచి అంగడిబజార్ వరకు ఎంపీ చామల కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్‌రెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పావల వడ్డీ పేరుతో మహిళల నుంచి రూ.3వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ సంవత్సరకాలంలో చేర్యాలకు రూ.36 కోట్ల నిధులు ఇచ్చిననట్లు తెలిపారు. మహిళలందరూ మహిళా సంఘాలలో చేరి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే చేర్యాల ప్రాంతం నాలుగు ముక్కలుగా చీలి అస్థిత్వాన్ని కోల్పోయిందన్నారు. చేర్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. అంతకు ముందు భువనగిరి ఎంపీ చామల మట్లాడుతూ 1600 మంది అమరుల త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రం ఎటుపోయిందని, అది దొరల పాలైందని విమర్శించారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని ఉద్యమం మొదలు పెట్టిన కేసీఆర్ తానే గద్గెనెక్కారని గుర్తు చేశారు. దొంగ ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్ నియెజికవర్గంలో డబ్బులతో మాయచేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చేర్యాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెరార్టీతో గెలిపించాలని కోరారు.


