పదేళ్లు దోచుకున్నారు
మెదక్‌జోన్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దో చుకొని దాచుకున్నారని ఎమ్మెల్యే రోహిత్‌రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీశ్‌రావు మెదక్‌పై వివక్ష చూపటంతో పూర్తిగా వెనుకబాటుకు గురైందన్నారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కానుగ రాధికను భారీ మెజార్టీతో గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు గంగాధర్, కానుగ భూపతి తదితరులు ఉన్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై ఆరా
రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. అధికారులతో కలిసి పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. అనంతరం ఆర్వోలు, బీఎల్వ్‌లు, ఏఆర్వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులతో పాటు తహసీల్దార్ రజని ఉన్నారు.
స్వయం ఉపాధితో
ఆర్థికాభివృద్ధి
పాపన్నపేట(మెదక్): స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించగలుగుతారని జిల్లా సంక్షేమాధికారి హేమభార్గవి అన్నారు. శుక్రవారం పాపన్నపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం 34 మంది మహిళలకు శిక్షణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటరమణమ్మ, సర్పంచ్ పావని, నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు
చెల్లించండి: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్: పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో డీపీఓ యాదయ్యకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఆన్‌లైన్‌లో పేర్లు లేని కార్మికులను చేర్చడంతో వారికి రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రతినెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలన్నారు. పాత కార్మికులను తొలగించకుండా కొనసాగించాలని కోరారు. ఏడుపాయలలో విధులు నిర్వర్తించే వారికి రోజుకు రూ.1,000తో పాటు కనీస వసతులు కల్పించాలన్నారు. ఆమె వెంట సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంతోశ్, కార్మికులు అర్జయ్య, శివయ్య ఉన్నారు.
‘నిర్వాసితుల సమస్యలు
పరిష్కరిస్తాం’
గజ్వేల్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అ న్నారు. శుక్రవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో మన్నెం విష్ణువర్ధన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్ల మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
పదేళ్లు దోచుకున్నారు
పదేళ్లు దోచుకున్నారు
పదేళ్లు దోచుకున్నారు


