కాంగ్రెస్‌కు ఓటమి భయం
నర్సాపూర్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ పార్టీ నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవా రం నర్సాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం పన్నులు పెంచి అభివృద్ధిని మరిచిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కోతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు దశాబ్దాలు గడుస్తున్నా, పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుతి లేని సంసారం వంటిదని ఎద్దేవా చేశారు. నర్సాపూర్ పచ్చని అడవిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకుండా నిలువరించింది గుర్తు చేశారు. కేంద్ర నిధుల ద్వారా జరిగిన అభివృద్ధిని గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌యాదవ్, జిల్లా ఇన్‌చార్జి నరసింహారెడ్డి, మున్సిపల్ ఎన్నికల ప్రభారి పాపయ్య గౌడ్, రాజమణి, సంఘసాని సురేశ్, బుచ్చెశ్‌యాదవ్, లత రమేశ్ యాదవ్, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు


