పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు ఎస్పీ మహేందర్ చెప్పారు. శుక్రవారం పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా పోలింగ్ కేంద్రాల నుంచి వంద మీటర్ల దూరంలో ఉండాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన నింబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. డబ్బు, మద్యం, బహు మ తులు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఈసందర్భంగా సీఐ జాన్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టును పరిశీలించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.
అదనపు ఎస్పీ మహేందర్


