లెక్కలు తీస్తూ.. గాలం వేస్తూ | - | Sakshi
Sakshi News home page

లెక్కలు తీస్తూ.. గాలం వేస్తూ

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

లెక్క

లెక్కలు తీస్తూ.. గాలం వేస్తూ

కుల సంఘాలతో అభ్యర్థుల మంతనాలు

జిల్లాలోని మెదక్‌, రామాయంపేట, నర్సా పూర్‌, తూప్రాన్‌ మున్సిపాలిటీల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లు అడిగింది లేదనకుండా అప్పగిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ముఖ్యంగా కుల సంఘాలకు వంట సామగ్రి, టెంట్‌హౌస్‌లు, కాలనీలో బోర్లు వేయిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. కొన్ని కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉంటే ఎన్నికల అనంతరం బోర్లు తవ్విస్తామంటూ హామీ ఇస్తున్నారు. మెదక్‌ బల్దియాలోని ఓ వార్డులో ఓ వర్గానికి చెందిన ఓట్లు 350కి పైగా ఉంటాయి. వారు కమ్యూనిటీ హాల్‌ కావాలని కోరటంతో ఆ కాలనీలో బరిలో ఉన్న ఓ పార్టీ అభ్యర్థి గెలవగానే నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇలా కుల సంఘాల పెద్దలు అడిగిందే తడువుగా అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు.

అన్నా.. ప్రచారానికి రండి!

ప్రధానంగా అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన అభ్యర్థు లు ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్టీ ఇన్‌చార్జిలు, రాష్ట్రస్థాయి నేతలను ప్రచారానికి రావాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉండటంతో అన్ని వార్డుల్లోకి వెళ్లి ప్రచారం చేయటం కుదరదంటూ, నేతలు కార్నర్‌ మీటింగ్‌లకు హాజరవుతున్నారు. కొందరు అభ్యర్థులు రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో పట్టణాలు సందడిగా మారాయి.

ప్రచారానికి మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. ఓటర్లకు గాలం వేసేందుకు కార్యాచరణ షురూ చేశారు. కుల సంఘాల వారీగా మచ్చిక చేసుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అడిగినవి సమకూరుస్తూ ముందుకెళ్తున్నారు.

– మెదక్‌జోన్‌

అడిగినవి సమకూరుస్తామని హామీలు

కాలనీల్లో బోర్లు

వేస్తామంటూ ఒప్పందాలు

రసవత్తరంగా

పురపాలక రాజకీయం

ప్రచారంలో వెంట తిప్పుకున్న వారికి రాత్రి అయిందంటే మద్యం, బిర్యానీ సమకూరుస్తున్నారు. కొందరు అభ్యర్థులు వారి ఇంటి వద్దే నిత్యం వంటా, వార్పు చేసి మాంసహారంతో భోజనం పెడుతున్నారు. అలాగే డబ్బులు ఇస్తున్నారు. ఇవ్వన్నీ పోనూ మళ్లీ వ్యక్తిగతంగా ఓటుకు ముట్ట జెప్పాల్సిందేనని ఓ అభ్యర్థి తెలిపారు. దీంతో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయినా గెలుపే లక్ష్యంగా ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడటం లేదు.

ఖర్చు ఎంతైనా సరే..

లెక్కలు తీస్తూ.. గాలం వేస్తూ1
1/1

లెక్కలు తీస్తూ.. గాలం వేస్తూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement