నిర్భయంగా ఓటేయండి
మెదక్ కలెక్టరేట్/తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వ హించారు. ఎన్నికల సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్‌శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే తూప్రాన్ పట్టణంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ టౌన్ సీఐ మహేష్, రూరల్ సీఐ జార్జ్, మెదక్ డివిజన్‌లోని ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


