నిర్వాసితులను ఆదుకుంటాం
కాంగ్రెస్‌ను గెలిపిస్తే ‘రెవెన్యూ డివిజన్’
● త్వరలోనే పెండింగ్ ప్యాకేజీలు అందజేస్తాం
● కార్మికశాఖ మంత్రి వివేక్
గజ్వేల్: సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్ ప్యాకేజీలను అందజేస్తామని కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. ఆదివారం గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్‌రావుల నిర్లక్ష్యంతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. వారికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్‌కు గజ్వేల్ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా చారిత్రక నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పాల్గొన్నారు.
దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరితే రెవెవిన్యూ డివిజన్‌సాధనకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాక పట్టణంలోని డబుల్‌బెడ్రూం కాలనీ సముదాయంలో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో 20 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే డబుల్‌బెడ్రూం కాలనీల్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.


