మహిళలను కోటీశ్వరులను చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మహిళలను కోటీశ్వరులను చేస్తాం

Apr 3 2026 10:01 AM | Updated on Apr 3 2026 10:01 AM

మహిళలను కోటీశ్వరులను చేస్తాం ఐటీఐలో వృత్తి నైపుణ్య కోర్సులు సమస్యలు పరిష్కరిస్తాం మల్లన్న సన్నిధిలో ఆర్‌జేసీ రామకృష్ణారావు దళారులకు అమ్మి నష్టపోవద్దు

నర్సాపూర్‌ రూరల్‌: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ అన్నారు. గురువారం మండలంలోని రెడ్డిపల్లిలో జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేషన్‌ కార్డులు, రైతు భరోసా, బీమా, ఉచిత కరెంట్‌, కల్యాణలక్ష్మి, విద్యార్థులకు అల్పాహారంతో పాటు అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మ, అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో 15 రోజుల స్వల్పకాలిక వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అడ్వాన్స్‌ టెక్నాలజీతో ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా పాస్‌ లేదా ఫెయిల్‌ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.

రామాయంపేట(మెదక్‌): బల్దియా పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్య హామీ ఇచ్చారు. గురువారం జరిగిన వార్డు సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆయా వార్డుల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు, అఽ దికారుల సహకారంతో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులు పలు సమస్యలపై వినతులు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామిని దేవాదాయ శాఖ ఆర్‌జేసీ రామకృష్ణారావు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రాదాన్ని , శేష వస్త్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్‌, ఏఈఓ బుద్ది శ్రీనివాస్‌, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీమంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటజోన్‌: ఉత్పత్తులను దళారులకు అమ్మి నష్టపోవద్దని మాజీ మంత్రి హరీష్‌రావు రైతులకు సూచించారు. ఈ విషయమై గురువారం ఆయన పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు. సిద్దిపేట మార్కెట్‌లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతుండటంతో అసెంబ్లీలో కొట్లాడితే వెంటనే ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారన్నారు. తక్కువ ధరకు ప్రైవేట్‌ కు అమ్ముకోని రైతులు నష్ట పోవద్దన్నారు.అసెంబ్లీలో మీ గురించి కొట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా చూశామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలరె సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement