ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం | - | Sakshi
Sakshi News home page

ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

Apr 3 2026 10:01 AM | Updated on Apr 3 2026 10:01 AM

ఎమ్మెల్యే రోహిత్‌రావు

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 16, 17వ వార్డులో జరిగిన వార్డు సభలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్‌, రూ. 500 సిలిండర్‌, సన్న బియ్యం వంటి ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. కొత్త పథకాల్లో భాగంగా విద్యార్థులకు అల్పాహారం, అన్నివర్గాల ప్రజలకు జీవిత బీమా, దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, రైతులకు మేలైన వంగడాలు అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement