అదనపు కలెక్టర్
నగేశ్
అల్లాదుర్గం(మెదక్): అర్హులైన పేదలకు విద్య, వైద్యం, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం మండలంలోని చిల్వెరలో నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి విద్య అందినప్పుడే దేశం, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం యువత ఉండటంతో గ్రామాభివృద్ధి సాధించి, ఉత్తమ పంచాయతీకి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర శశిధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పాపన్నగౌడ్ పోరాటం చిరస్మరణీయం
మెదక్ కలెక్టరేట్: కులం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు మంగ రమేశ్‌గౌడ్, రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ విద్యాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


