పకడ్బందీగా పథకాల అమలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పథకాల అమలు

Apr 3 2026 10:01 AM | Updated on Apr 3 2026 10:01 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

చేగుంట(తూప్రాన్‌): ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. మండలంలోని వడియారంలో గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలకు పలు అంశాల్లో శిక్షణ కల్పించి ఉపాధి పొందడానికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే ఉద్దేశంతోనే ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి హేమాభార్గవి, సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నాగరాజు, ఎంపీఓ విజయ్‌పాల్‌రెడ్డి ఆయా శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement