పుర పోరు.. ఏర్పాట్ల జోరు
బల్దియా ఎన్నికలకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల ఎంపిక పూర్తి చేశారు. వారికి శిక్షణ సైతం ఇచ్చారు. బ్యాలెట్ బాక్స్‌లు సైతం సిద్ధంగా ఉంచారు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో అందుకు పూర్తి స్థాయిలో అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
– రామాయంపేట(మెదక్)
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి పేపర్లు, వైట్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్ల్యూ, పింక్ కవర్లు, ఇంకు, పేపర్ సీళ్లు, ట్యాగ్స్, అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల నిబంధనల బుక్స్, ఇతర సామగ్రి కార్యాలయాలకు చేరాయి. నామినేషన్లు స్వీకరించే కార్యాలయాలు, స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ సెంటర్ల కోసం భవనాల ఎంపిక సైతం అధికారు లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వాటిలో వసతుల కల్పన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాంపులు, లైటింగ్, ఫర్నిచర్, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
మూడు వార్డులకు ఒక ఆర్వో
ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం
ఇప్పటికే అధికారులు,
సిబ్బంది కేటాయింపు
మున్సిపల్ కేంద్రాలకు చేరిన సామగ్రి
జిల్లాలో ఇలా..
మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ ఆర్వోలు ఏఆర్వోలు నోడల్
కేంద్రాలు అధికారులు
మెదక్ 32 64 15 15 10
నర్సాపూర్ 15 30 8 8 5
తూప్రాన్ 16 32 9 9 5
రామాయంపేట 12 24 7 7 5
ఈసారి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఈసారి గెజిటెడ్ హోదా ఉన్నవారినే ఆర్వోలుగా నియమించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ఆయా వార్డులకు ఆర్వోలే బాధ్యత తీసుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు వీరే చేయనున్నారు. కాగా ప్రతి మున్సిపాలిటీకి 20 శాతం అదనంగా ఆర్వోలు, ఏఆర్వోలను నియమించారు. ముఖ్యంగా ఎన్ని కల ఫలితాల అనంతరం కౌన్సిలర్లుగా ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేయడం కూడా వీరి బాధ్యతే.


