ఓటు వజ్రాయుధం
మెదక్ కలెక్టరేట్: దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్‌ను నిర్ణయించుకొనే ఏకై క అస్త్రం. ఎన్నికలు రాగానే హడావుడి చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించే నాయకులు, అనంతరం ఓటేసిన వారిని విస్మరించే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు ముఖ్య భూమిక పోషించాల్సిన సమయం. ఓటు వేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పౌరులు అనామకులను అందలమెక్కించిన వారవుతారు. తాను ఒక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందనే అభిప్రాయం అనర్హులకు ఊతం ఇచ్చినట్లవుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఓటు వినియోగించుకునేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం ఓటర్లు 6,10,512 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,93,547 ఉండగా, మహిళలు 3,16,955 ఓటర్లు ఉన్నారు. ఇతరులు 10 మంది ఉన్నారు. గ్రామాలు, పట్టణాల్లో 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నేడు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది ‘నా దేశం– నా ఓటు‘ అనే అంశంపై అధికారులు కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆధ్వర్యంలో విద్యార్థు లు, యువకులు, వివిధ ఎన్జీఓ సంస్థల సభ్యులు, అధికారులు మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ చేస్తారు. గత శాసనసభ, పార్లమెంటు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మంది ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.
ఈ ఏడాది నాదేశం–
నా ఓటు
రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు
జిల్లావ్యాప్తంగా
6,10,512 మంది ఓటర్లు
నేడు జాతీయ ఓటర్ల
దినోత్సవం


