కష్టపడిన వారికే పార్టీ టికెట్
తూప్రాన్: పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరగా, పార్టీ కండువా కప్పి ఆ హ్వానించారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్ పురపాలక ఇన్‌చార్జి మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నా యకులు మామిండ్ల అనిల్, శ్రీకాంత్‌చారి, బందెల నరేశ్, గణేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు


