అందని గ్యాస్ రాయితీ!
వివరాలు 8లో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ‘మినీ మేడారం’ సందడి.. జాతరల నేపథ్యంలో ఊరూరా సంబరాలు వెల్లువెత్తనున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు ఆయా గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ గద్దెలను సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు నెలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
మెదక్‌జోన్: జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రాయితీ డబ్బుల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వారిని మహాలక్ష్మి పథకానికి అర్హులుగా ఎంపిక చేసింది. జిల్లావ్యాప్తంగా 17 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, అధికారిక లెక్కల ప్రకారం 2,35,712 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, ఇండియన్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. లబ్ధిదారులు రూ. 920 చెల్లించి గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. అనంతరం వారి అకౌంట్‌లో ఒకసారి రూ. 44, మరోసారి రూ. 376 జమ అవుతోంది. ఈ లెక్కన ఒక్క గ్యాస్‌పై రూ. 420 తిరిగి లబ్ధిదారులకు వస్తుండటంతో సదరు వ్యక్తికి గ్యాస్‌కు రూ. 500 చెల్లిస్తునట్లు లెక్క. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల సబ్సిడీ చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు నెలలుగా చెల్లించడం లేదని పలువురు మహిళలు వాపోతున్నారు. పథకం ప్రారంభమైన కొన్ని నెలలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ నగదును జమ చేశారు. తర్వాత నగదు జమ కాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొంత మందికే రాయితీ వచ్చిందని, మిగితా వారికి నగదు జమ కాలేదని తెలుస్తోంది. ఇదే విషయమై అధికారులను సంప్రదిస్తే తమకు రాయితీ గ్యాస్‌పై ఎలాంటి సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం.
రూ. 26.58 కోట్ల బకాయిలు
ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్ల చొప్పున, ఒక్కోటి రూ. 500లకే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన జిల్లాలో మూడు నెలల్లో సుమారు 7,07,136 గ్యాస్ బండలకు ఒక్కోదానికి రూ. 376 చొప్పున లబ్ధిదారులకు రూ. 26,58,83,136 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో పేద, మధ్య తరగతి మహిళలు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయా అంటూ ఆరా తీస్తున్నారు. నెలల తరబడి సబ్సిడీ కోసం ఎదురుచూసే బదులు బుక్ చేసే సమయంలోనే రూ. 500 చెల్లిస్తే గ్యాస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
మూడు నెలలుగా జమకాని డబ్బులు
లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు
జిల్లావ్యాప్తంగా
2.35 లక్షల గ్యాస్ కనెక్షన్లు


