జంతు గణన వేగవంతం
చిన్నశంకరంపేట(మెదక్): వన్యప్రాణుల లెక్కి ంపు వేగవంతం చేయాలని రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నార్సింగి మండలం వల్లూర్ అటవీప్రాంతంలో వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు మాంసాహార జంతువులను లెక్కించనున్నట్లు తెలిపారు. తర్వాత మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కింపు ఉంటుందన్నారు. జాతీయ వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియలో భాగంగా అటవీ ప్రాంతంలో పులుల సంచారంపై ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
రైస్‌మిల్లులో తనిఖీలు
తూప్రాన్: మండలంలోని ఘనపూర్ శివారు వీరభద్ర రైస్‌మిల్లులో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానందం, డీఎం జగదీష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ తాటి నర్సింలు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టగా, 21,596 క్వింటాళ్ల కొరత ఉంది. వీటి విలువ సుమారు రూ. 4.50 కోట్లని నిర్ధారించారు. తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో తనిఖీలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు అధికారులు వెల్లడించా రు. రైస్‌మిల్ యజమాని అందుబాటులో లేరని, చట్టరీత్యా చర్యలు తప్పవని అధి కారులు హెచ్చరించారు.
కృత్రిమ గర్భధారణతో
మేలు జాతి దూడలు
కౌడిపల్లి(నర్సాపూర్): కృత్రిమ గర్భధారణతో మేలుజాతి దూడలు జన్మిస్తాయని, దీంతో పాలు అధికంగా ఇవ్వడం ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. శనివారం మండలంలోని కంచన్‌పల్లిలో పశువైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా పశువులకు గర్భకోశ వ్యాధులు, నట్లల నివా రణ, చూడి పరీక్షలు నిర్వహంచి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యంగౌడ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, మండల పశువైద్యాధికారి ఫర్హిన్ ఫాతిమా, స్వప్న, కిషన్‌బాబు, వీరారెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, కవిత, రఘుపతి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట ఎన్నికల
ఇన్‌చార్జిగా సాయిబాబా
రామాయంపేట(మెదక్): రామాయంపేట ము న్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా నర్సాపూర్ డీఎల్ పీఓ సాయిబాబా నియమితులయ్యారు. ఈమేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చే శారు. ఇటీవల మున్సిపల్ కార్యకలాపాల తీరు వివాదస్పదమైంది. దీంతో అధికారులు ఆయనను ప్రత్యేకంగా నియమించారు. సాయిబాబా శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జంతు గణన వేగవంతం
జంతు గణన వేగవంతం
జంతు గణన వేగవంతం


