పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
నర్సాపూర్ రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్, మందుల నిల్వ గది, ఇన్ పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్, టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఎన్ని డెలివరీలు జరుగుతున్నాయని ఆరా తీశారు. తనిఖీ సమయంలో డాక్టర్ రఘువరన్ సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా రెడ్డిపల్లి సర్పంచ్ సుమతి శివకుమార్ కలెక్టర్‌ను కలిసి గ్రామ సమస్యలను విన్నవించారు.


