రాజ్యాంగానికి లోబడి జీవించాలి
మెదక్ మున్సిపాలిటీ: పౌరులుగా రాజ్యాంగ విలువలకు లోబడి జీవించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అత్యంత విశిష్టమైనదని అన్నారు. ఈసందర్భంగా ఆ మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. విధులను అంకితభావంతో నిర్వర్తించి ప్రజల మనసులు గెలవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, రంగా నాయక్, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు


