ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శనివారం పట్టణంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కౌంటర్ల ఏర్పాటు కోసం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మధులత తదితరులు ఉన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్‌రాజ్


