రైతులకు విశిష్ట గుర్తింపు అవసరం
నర్సాపూర్‌రూరల్/కౌడిపల్లి: కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మండలం నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. 11 అంకెలతో కూడిన రైతు విశిష్ట సంఖ్యను ప్రతి రైతు పొందాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉండే ఏఈఓల వద్దకు రైతులు తమ పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్‌కు లింకు ఉన్న మొబైల్‌ను తీసుకొని వెళ్లాలన్నారు. మీ సేవలో సైతం నమోదు చేసుకోవచ్చని సూచించారు. అనంతరం కౌడిపల్లి మండల పరిధిలోని కన్నారం గ్రామంలో పర్యటించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ఏడీ సంధ్యారాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి దీపిక, సర్పంచ్ దేవిసింగ్, ఏఈఓ దుర్గాప్రసాద్, కార్యదర్శి శేఖర్, రైతుల పాల్గొన్నారు.
డీఏఓ దేవ్‌కుమార్


