ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Feb 10 2026 9:46 AM | Updated on Feb 10 2026 9:46 AM

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సోమవారం తెలిపారు. ఈనెల 11న జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌కు జరుగుతుందన్నారు. అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమాల ను తప్పనిసరిగా పాటించాలన్నారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని వెస్లీ జూనియర్‌ కళాశాల, నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీ, తూప్రాన్‌ నోబుల్‌ ఫార్మా కాలేజ్‌, లింగారెడ్డిపల్లి, రామయంపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచే పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. అంతకుముందు జిల్లాలోని ఎన్నికల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈనెల 11న స్థానిక సెలవుగా ప్రకటించారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అసిస్టెంట్‌ కమిషనర్‌ మకరందుకు కలెక్టర్‌ స్వాగతం పలికారు. ఇదిలాఉండగా మెదక్‌ మున్సిపాలిటీ పరిధి 18వ వార్డులోని పోలింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఓటరు స్లిప్‌ను బూత్‌స్థాయి అధికారి కలెక్టర్‌కు అందజేశారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement