ఎన్నికల నిబంధనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు తప్పనిసరి

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

ఎన్నికల నిబంధనలు తప్పనిసరి

ఎన్నికల నిబంధనలు తప్పనిసరి

మెదక్‌ కలెక్టరేట్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో ఎక్స్‌ అఫీషియో ఎంపిక కోసం నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుంచి 14వ తేదీలోపు నోటీసులు జారీ చేసి ఆప్షన్‌ తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో టెలీ కాన్పరెన్స్‌ నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తులు, జాబితా ప్రకటించాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement