యాప్ ద్వారా విక్రయించాలి
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు జిల్లాలో ఎక్కడైనా యూరియా కొనుగోలు చేయవచ్చని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి మాట్లాడారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా అమ్మాలని, కొనుగోలు చేయాలని వ్యాపారులు, రైతులకు సూచించారు. యాప్ ద్వారా యూరియా అమ్మకాల వివరాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీఏ సంధ్యారాణి, సిబ్బంది యాదగిరి, దుర్గాప్రసాద్, తేజస్విని తదితరులు ఉన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని మహమ్మద్‌నగర్ పీఏసీఎస్‌ను డీఏఓ తనిఖీ చేసి యూరియా బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు.
సెల్‌ఫోన్‌కు దూరంగా
ఉండండి: డీఈఓ
మెదక్‌జోన్: పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని డీఈఓ విజయ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డీఈఓ మెమోంటోలు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా ర్థులు నిరంతరం సెల్‌ఫోన్లు చూడటం వల్ల చదువు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు, కొండల్‌రెడ్డి, సోషల్ ఫోరం పూర్వ అధ్యక్షుడు చల్లా లక్ష్మణ్, దేవిసింగ్, సత్యనారాయణ, ప్రసాద్‌రెడ్డి, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
అందరూ మెచ్చే
బడ్జెట్‌పై విమర్శలా?
దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: దివ్యాంగులకు ఉపకరణాలు అందించనున్నారని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్‌చైర్, మొబైల్‌బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్మెంట్,వీల్‌చైర్, లాప్‌టాప్స్, టాబ్స్, వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 10లోపు http://http.tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
యాప్ ద్వారా విక్రయించాలి


