బీఫామ్ ఎవరికో
న్యూస్‌రీల్
పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించని పార్టీలు
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● పలు వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ
● నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు ఇబ్బడి ముబ్బడిగా నామినేషన్లు వేశారు. ఇప్పటికే స్క్రూట్నీ సైతం ముగియగా, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు విత్‌డ్రా గడువు ముగియనుంది. కాగా వీరిలో కొందరు స్వచ్ఛందంగా విత్‌డ్రాకు ముందుకు వస్తుండగా, మరికొందరు లావాదేవీలు చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు నేతల ఒత్తిడితో విత్‌డ్రాకు సిద్ధమైనట్లు తెలిసింది.
– మెదక్‌జోన్
జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. వీటిలో 519 మంది ఆశావహులు 668 నామినేషన్లు వేశారు. కొందరు రెండు, మూడు సెట్ల చొప్పున దాఖలు చేశారు. కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బరిలో నిలిచే అభ్యర్థులకు పూర్తిస్తాయిలో బీఫామ్‌లు ఇవ్వలేదు. మెజార్టీ అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ప్రకటించటంతో వారు ప్రచారం ముమ్మరం చేశారు. మరికొందరి పేర్ల ప్రకటించకపోవడంతో టెన్షన్ నెలకొంది. టికెట్ ఆశించిన కొందరికీ బీఫామ్‌లు దక్కకుంటే మరో పార్టీలోకి జంప్ అవుతారనే ఉద్దేశంతోనే అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా బీఫామ్‌లు నేరుగా అధికారులకు ఇవ్వనుననట్లు తెలిసింది.
పార్టీల ప్రత్యేక ఫోకస్
మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో నిర్వహిస్తుండటంతో అన్ని పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్, రామాయంపేట బల్దియాలపై ప్రత్యేక దృష్టి సారించగా, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలపై దృష్టి పెట్టారు. అలాగేే మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని నాలుగు పురపాలికలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హూస్సేన్‌ను జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించారు. బీజేపీ సైతం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిలను నియమించింది.
కండువాలు మార్చుతున్నారు
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నేతలు కండువాలు మార్చుతున్నారు. మెదక్ మాజీ కౌన్సిలర్ గోదల జ్యోతి, కృష్ణ దంపతులు చాలాకాలంగా కాంగ్రెస్‌లో ఉన్నారు. గతనెల 22న హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి పట్టణంలోని 32వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించగా, నామినేషన్ సైతం వేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. ఆ వార్డులో కాంగ్రెస్ నుంచి గొదల మానస, సాయి నామినేషన్ వేశారు. దీంతో ఈ వార్డు ఏకగ్రీవం కానుంది. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ వీరు ఇరువురు ఇదే విధంగా వ్యవహరించటంతో అప్పుడూ మాసన ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
బీఫామ్ ఎవరికో


