పది టాపర్లకు నగదు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

పది టాపర్లకు నగదు పురస్కారం

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

పది టాపర్లకు నగదు పురస్కారం

పది టాపర్లకు నగదు పురస్కారం

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి టాపర్‌ విద్యార్థులకు నగదు పురస్కారం ఇచ్చేందుకు శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బాధ్యులతో కలిసి వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు శ్రీరామ్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2.2 కోట్ల నగదు ప్రకటించినట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి రూ. 5 లక్షలు, రెండో ర్యాంకుకు రూ.3 లక్షలు, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో టాపర్‌కు రూ. 2 లక్షలు, మండలాల్లో ప్రథమస్థానం పొందిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పున నగదు పురస్కారం అందించనున్నట్లు వివరించారు. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా సైనన్స్‌ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు, మెదక్‌, శ్రీరామ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రత్నాకర్‌, జూనియర్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement