జిల్లాలో యూరియా కొరత లేదు
జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్
రామాయంపేట(మెదక్): ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన యూరియా సునాయాసంగా లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ అన్నారు. శనివారం రామాయంపేటలో యాప్ ద్వారా యూరియా పంపిణీని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు పంట విస్తీర్ణాన్ని బట్టి యూరియా సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలి పారు. యాప్‌తో రైతులు యూరియా కోసం క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా రైతులే ఫోన్‌లో ఇంటి నుంచే యూరియా ముందస్తుగా బుక్ చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన యూరియా సిద్ధంగా ఉందన్నారు. స్థానిక వ్వవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.
అందుబాటులోకి యాప్
చిన్నశంకరంపేట(మెదక్): ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి వచ్చిందని డీఏఓ దేవ్‌కుమార్ తెలిపారు. శనివారం నార్సింగిలోని ఆగ్రోస్ కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. రైతులు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంట్లో నుంచే ముందుగా యూరియా బుక్ చేసుకోని కొనుగోలు చేయవచ్చన్నారు. యాప్‌లో సమస్య వస్తే ఏఓ, ఏఈఓలను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట నార్సింగి ఏఓ భరత్‌కుమార్, రైతులు ఉన్నారు.


