నేడు బీఆర్‌ఎస్‌ నిరసన | - | Sakshi
Sakshi News home page

నేడు బీఆర్‌ఎస్‌ నిరసన

Feb 1 2026 10:39 AM | Updated on Feb 1 2026 10:39 AM

నేడు బీఆర్‌ఎస్‌ నిరసన

నేడు బీఆర్‌ఎస్‌ నిరసన

ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్‌ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి, దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన చర్యని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధకుడిగా, సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తిని దర్యాప్తునకు పిలవడం సరికాదన్నారు. 65 ఏళ్లు నిండిన కేసీఆర్‌ ఇంటికి వెళ్లి విచారణ జరపాలని చట్టం చెబుతున్నా, రేవంత్‌రెడ్డికి అనుకూలంగా పనిచేసే కొందరు వ్యక్తులు కేసీఆర్‌ను అవమానాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఆదివారం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement