పుర పోరు.. డిజిటల్‌ హోరు | - | Sakshi
Sakshi News home page

పుర పోరు.. డిజిటల్‌ హోరు

Feb 1 2026 10:39 AM | Updated on Feb 1 2026 10:39 AM

పుర పోరు.. డిజిటల్‌ హోరు

పుర పోరు.. డిజిటల్‌ హోరు

● అభ్యర్థుల ‘స్మార్ట్‌’ ప్రచారం ● తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రచారం

రామాయంపేట(మెదక్‌): మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రి య ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో దూ సుకెళ్తున్నారు. ప్రధానంగా సామాజిక మాద్య మాలపై దృష్టి సారించారు. సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యే క వ్యూహాలు రూపొందిస్తున్నారు. తమ ను గెలిపిస్తే ఏం చేస్తామో సామాజిక మాద్యమాల్లో వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యూత్‌ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఈమేరకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్ర్ట్రాగాంను విరి విగా వినియోగించుకుంటున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎక్కువ శాతం అక్షరాస్యులు ఉండటంతో పాటు అందరి వద్ద స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. దీంతో అభ్యర్థుల ప్రచారం సులువుగా మారింది. కంప్యూటర్‌ సాయంతో ప్రచార సందేశాలు రూపొందించుకొని మూకుమ్మడిగా ఓటర్లకు చేరవేస్తున్నారు.

ఒక్కో వార్డు నుంచి ముగ్గురు

యా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇంకా బీఫాంలు రాకముందే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నాలుగు ము న్సిపాలిటీల్లో ఒక్కో వార్డు నుంచి కనీసం ముగ్గురు నుంచి ఎనిమిది మంది వరకు పోటీలో నిలిచారు. ఉపసంహరణల తర్వా త పోటీలో ఉండే అసలైన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు కుల సంఘాలు, పెద్దలను విడి గా కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. కార్యకర్తల కోసం ప్రత్యేకంగా హోటళ్లలో ఉదయం, సాయంత్రం భోజనాలు చేయిస్తున్నారు. కొన్ని వార్డుల్లో మద్యం పంపిణీ కూ డా ప్రారంభించినట్లు సమాచారం. ఈ మేరకు అభ్యర్థులు వార్డుల వారీగా ఓటర్ల వివ రాలు, ఫోన్‌ నంబర్లు సే కరించి ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు.

బుజ్జగింపుల పర్వం షురూ

పోటీలో ఉన్న అభ్యర్థుల్లో చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే టికెట్‌ గొడవల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు ఇతర పార్టీల్లో చేరగా, మళ్లీ అదే పరిస్థితి పురావృతం కాకుండా నేతలు వ్యూ హాలు రచిస్తున్నారు. అభ్యర్థుల పలుకుబడి, ఆర్థిక స్థోమత దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని నాలు గు మున్సిపాలిటీల్లో 75 వార్డుల్లో మొత్తం 519 మంది అభ్యర్థులు 668 నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement