వందశాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

Jan 29 2026 8:35 AM | Updated on Jan 29 2026 8:35 AM

వందశా

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

రేగోడ్‌(మెదక్‌): త్వరలో జరగబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ విజయ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు, తదితర రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో చదివించి వారి ప్రతిభను తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. సింగిల్‌ టీచర్‌ ఉన్న పాఠశాలలు మూతపడకుండా నడపాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట జీసీడీఓ జగదీశ్వరి, ఎంఈఓ గురునాథ్‌, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ స్వయంప్రభ, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సుశీల, సీఆర్‌పీ సంతోష్‌ గుప్తా ఉన్నారు.

ప్రశ్నార్థకంగా విద్యారంగం

మెదక్‌జోన్‌: రాష్ట్రంలో విద్యారంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, కార్యదర్శి రవిచందర్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి పా ల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

నర్సాపూర్‌ రూరల్‌: క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని విద్యుత్‌శాఖ డీఈ రామేశ్వర్‌ తెలిపారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రజాబాటలో పాల్గొని మాట్లాడారు. లో ఓల్టేజీ, వేలాడుతున్న తీగలు, శిథిలావస్థకు చేరిన స్తంభాల గురించి ఆరా తీశారు. ప్రజాబాటలో తెలుసుకున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. రెడ్డిపల్లిలో 25 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీ రమణారెడ్డి, ఏఈ రామ్మూర్తి, సర్పంచ్‌ పద్మ, అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం

వహించొద్దు

అల్లాదుర్గం(మెదక్‌): సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనీల హెచ్చరించారు. ‘విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ముప్పారం పల్లె దవాఖాన వైద్యురాలు నిర్మల అల్లాదుర్గం కేంద్రంలో ఎందుకు విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశ్నించారు. డాక్టర్‌ సారిక తమ ఫోన్లు తీసుకొని పరిశీలించినట్లు సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి అలా చేయొద్దని ఆమె హెచ్చరించారు. ముప్పారం పల్లె దవాఖాన డాక్టర్‌, సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తించాలని అదేశించారు.

వందశాతం  ఉత్తీర్ణత సాధించాలి 
1
1/3

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

వందశాతం  ఉత్తీర్ణత సాధించాలి 
2
2/3

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

వందశాతం  ఉత్తీర్ణత సాధించాలి 
3
3/3

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement